Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిలో అనువైన ప్రాజెక్టులకు జపాన్ సలహాలు

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్‌డీఏ అధికారులకు జపాన్‌ బృందం వివరించింది. జపాన్‌ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వా

అమరావతిలో అనువైన ప్రాజెక్టులకు జపాన్ సలహాలు
హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (01:50 IST)
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు ఉపయోగపడే పలు ప్రాజెక్టుల గురించి సీఆర్‌డీఏ అధికారులకు జపాన్‌ బృందం వివరించింది. జపాన్‌ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2015 అక్టోబర్‌ 22న జరిగిన ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశంపై ఈ బృందం పరిశీలించింది. దీనికి సంబంధించిన  నివేదికను జపాన్‌ బృందం తయారు చేసి శనివారం సీఆర్‌డీఏ అధికారులకు అందజేసింది. సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జపాన్‌ బృందం ఆయా ప్రాజెక్టులపై సీఆర్‌డీఏ, అమరావతి డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ), పోలీసుశాఖ అధికారులకు వివరించారు. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ రామమోహనరావు, డీసీపీ రాణా, ఇతర సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వీలుగా ఉండే ప్రాజెక్టుల గురించి జపాన్‌ బృందం చెప్పిన వివరాలు..
 
రాష్ట్రమంతంటికీ తక్కువ ఇంధన ఖర్చుతో అత్యుత్తమంగా ఇంటర్‌ నెట్‌ సేవలు అందించే స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ మాడ్యూలర్‌ డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచించారు. క్రౌడ్‌ కంప్యూటింగ్‌తో పాటు తక్కువ వ్యవధిలో  పౌరులకు ఉపయోగపడే దరఖాస్తులకు పరిశీలించేందుకు  ఈ మాడ్యులర్‌ డేటా సెంటర్‌ను ఉపయోగించవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలుసుకుని, కాపాడేందుకు ఉపయోగపడే వాతావరణ రాడార్‌ సిస్టమ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని జపాన్‌ బృందం సూచించింది. ఈ రాడార్‌ సిస్టమ్‌ రాజధాని ప్రాంతంలోని కాల్వలు, నది, మురికి కాల్వలు, రవా ణా రంగాలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుంది. తద్వారా ప్రాణ, భారీగా ఆస్తినష్టం జరగకుండా చూసుకోవచ్చు.
 
అతి తక్కువ ఖర్చుతో అతి పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికి ఇచ్చేందుకు వీలుగా ఒక ప్రాజెక్టును జపాన్‌ బృందం సీఆర్‌డీఏ అధికారులకు వివరించింది. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో తాగునీటి కోసం ఏ విధానాలను అవలంబిస్తున్నారో వివరించి  రాజధానిలో మంచినీటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. పర్యావరణ ఇబ్బందులు రాకుండా ఇంధనం కూడా ఉత్పత్తి చేసే సీవియేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వివరాలను బృందం వివరించింది. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా  సిగ్నల్స్‌ ఏర్పాటు గురించి వివరించారు. ఈ సందర్భంగా డీసీపీ రాణా విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యలు గురించి వారికి వివరించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు ఒక ప్రణాళిక ఇస్తామని జపాన్‌ బృందం హామీ ఇచ్చింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు దూరారా? గవర్నర్ తీవ్ర ఆగ్రహం..