Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు విజన్ ఫస్ట్ ఫ్రూట్ : శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు టక్కుల ఇండస్ట్రీ!

చంద్రబాబు విజన్ ఫస్ట్ ఫ్రూట్ : శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు టక్కుల ఇండస్ట్రీ!
, గురువారం, 27 నవంబరు 2014 (15:07 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన చేపట్టిన జపాన్ పర్యటన పూర్తిగా ముగియకముందే.. ఏపీ, తడలో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ట్రక్కుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన వరల్డ్ క్లాస్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు ముందుకు వచ్చింది. 
 
ఈ అంశంపై ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌తో చంద్రబాబు బృందం గురువారం సమావేశమైనపుడు ఈ విషయం వెల్లడైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ నచ్చడం వల్లే ఈ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వస్తున్నట్టు ఇసుజు వైస్ ఛైర్మన్ ప్రకటించారు. ఏపీలో తమతో పాటు మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఇసుజు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. 
 
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం జపాన్‌‌కు చెందిన ఆ దేశ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ ట్రక్కుల తయారీ యూనిట్లు భారత్‌లో 10 దాకా ఉన్నాయని ఆయన చెప్పారు.
 
అయినా, భారత మార్కెట్‌లో తమ కంపెనీ వాటా నామమాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్‌లో యూనిట్లు ఉన్నా ఏపీలో మరో యూనిట్‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. నిధులు, సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉన్నాయని, తమకు కావాల్సిందల్లా ప్రభుత్వ సంపూర్ణ సహకారం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu