Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు కేసీఆర్ చేసింది నేడు చంద్రబాబు చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం... తెలంగాణ మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ఎలా సాధించుకోవచ్చో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో కూర్చుని ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే రాదన్నారు. ఆనాడు తన తండ్రి కేసీఆర్, ఢిల్లీక

నాడు కేసీఆర్ చేసింది నేడు చంద్రబాబు చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం... తెలంగాణ మంత్రి కేటీఆర్
, బుధవారం, 20 జులై 2016 (19:53 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ఎలా సాధించుకోవచ్చో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో కూర్చుని ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే రాదన్నారు. ఆనాడు తన తండ్రి కేసీఆర్, ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసారనీ, అదేవిధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నం చేస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు.
 
పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు వల్ల ఒరిగేదేమీ ఉండదని తేల్చి చెప్పారు కేటీఆర్. ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలను ఒప్పించాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదనీ, చిత్తశుద్ధి ఉంటే ఆనాడే బిల్లులో ఈ అంశాన్ని ప్రవేశపెట్టి ఉండాల్సిందన్నారు. అదేమీ చేయకుండా ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తపిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకులాడటం హాస్యాస్పదం అని అన్నారు. కేవీపి ఈ బిల్లుతో తలికిందులు తపస్సు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రానే రాదని స్పష్టీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో కొందరిని దెయ్యాలు చంపుతున్నాయి... ఎం.పి హోంమంత్రి ప్రకటన