Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పుట్టపర్తి: బాబు

ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పుట్టపర్తి: బాబు
, శుక్రవారం, 25 జులై 2014 (10:43 IST)
ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పుట్టపర్తిని తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా ట్రస్టు సేవల గురించి ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యుల నుంచి తెలుసుకున్నట్లు సమాచారం. సత్యసాయికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని, ఇలాంటి సేవాసంస్థ దేశంలో ఎక్కడా లేదని బాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి అభివృద్ధి, సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలు చేయూతనిస్తానని ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu