Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు!

9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు!
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (19:41 IST)
9 సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.. పెళ్లంటే పారిపోయాడు. తొమ్మిది సంవత్సరాల పాటు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక ఆ ప్రేయసి ధర్నాకు దిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
తీరా పెళ్లి అనేసరికి అనిల్ వెనక్కి తగ్గాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ అతను పోలీసుల కంట పడలేదు. దీంతో ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో బైఠాయించింది. దీంతో ప్రియుడి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. 
 
మరోవైపు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఓ వాహనంలో వచ్చిన కొందరు దుండగులు మిర్చి ఆటోను అడ్డుకుని అందులోని వారిపై కత్తులతో దాడికి యత్నించారు. భయభ్రాంతులకు గురైన ఆటోలోని వ్యక్తులు పారిపోయారు. అయితే, మిర్చి ఆటోతో పరారైన దొంగలు.. ఆ ఆటో మధ్యలోనే బోల్తా పడటంతో వదిలేసి వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu