Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంజాగుట్ట మోనో హోటల్లో వంట గ్యాస్ లీక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..!

పంజాగుట్ట మోనో హోటల్లో వంట గ్యాస్ లీక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు..!
, బుధవారం, 4 మార్చి 2015 (10:14 IST)
హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ అయ్యి పేలుడు ప్రమాదం సంభవించింది. పంజాగుట్టలో ఉన్న మోనో హోటల్‌లో బుధవారం ఉదయం ఈ పేలుడు ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హోటల్‌లో వంట గదిలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. 
 
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వైద్యం నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో నష్టం అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu