Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎగిరే మనుషులు...! నెల్లూరులో రాత్రి విహారం... దెయ్యాలా.. దేవతలా..!!

ఎగిరే మనుషులు...! నెల్లూరులో రాత్రి విహారం... దెయ్యాలా.. దేవతలా..!!
, మంగళవారం, 26 మే 2015 (13:38 IST)
రాత్రయితే చాలు పెద్ద పెద్ద రెక్కలేసుకుని మనుషులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తారు. తెల్లటి రెక్కలతో జంటలు జంటలుగా దర్శనమిస్తారు. మబ్బుల మధ్య దాగుడుమూతలు ఆడుతుంటారు. చాలా కిందికి రావడం మళ్ళీ పైకి ఎగిరిపోవడం. ఈ ఎగిరే మనుషుల సంఘటన నెల్లూరు జిల్లాలో సంభవిస్తోంది. వారెవ్వెరు? ఎందుకలా చేస్తున్నారు? దెయ్యాలా.. దేవతలా..!! ఒకటే చర్చ సాగుతోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లాలోని చంద్రబాబు కాలనీ, సుందరయ్యకాలనీ, టైలర్స్ కాలనీ, గడమానుపల్లె, మౌర్యాకాలనీ  ప్రాంతాలలో జనం రాత్రయితే బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎప్పుడు ఎగిరే మనుషులు వస్తారో.. ఏం చేస్తారోననే భయం వారిని పట్టుకుంది. ఇదే పెద్ద చర్చగా సాగుతోంది. రాత్రి 8 గంటల నుంచి 12 గంటలలోపు ఎగిరే జనం మనుషులు ఆకాశంలో విహరిస్తుంటారు. జంటలు జంటలుగా తిరుగుతూ మబ్బుల చాటున దాగుడు మూతలు ఆడుతుంటారు.
 
కనీసం మూడు రోజులకొకమారు కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మొదట్లో పక్షులని భావించిన జనం ఆ తరువాత నిశితంగా పరిశీలిస్తే వారు మనుషులనే నిర్ధారణకు వచ్చారు. ఎగిరే మనుషులు కింది వరకూ వచ్చి వెళ్ళుతుంటారు. ఇవి దెయ్యాలేమోనని కొందరు జంకుతుంటే.. మరి కొందరు దేవదూతలు భువికి దిగి వచ్చారని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఆ ప్రాంతమంతా దీనిపై ఒకటే చర్చ. 

Share this Story:

Follow Webdunia telugu