Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ : కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి పదేళ్ల జైలు

కన్నబిడ్డ అనే విషయాన్ని మరిచిపోయి అత్యాచారం జరిపిన కన్నతండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... విజయవాడ నగరంలోని పాయకాపురం ప్రాంతానికి చెం

విజయవాడ : కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి పదేళ్ల జైలు
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:02 IST)
కన్నబిడ్డ అనే విషయాన్ని మరిచిపోయి అత్యాచారం జరిపిన కన్నతండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... విజయవాడ నగరంలోని పాయకాపురం ప్రాంతానికి చెందిన నిందితుడు డేరంగుల ఏడుకొండలు(38), అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుండేవారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు పనుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా వలస వెళ్లారు. భర్త మద్యానికి బానిసై కన్న కుమార్తె(15)ను భయపెట్టి ఇంట్లో ఎవరూలేని సమయంలో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో 2016 ఏప్రిల్‌ 20న కుమార్తె తల్లికి జరిగిన విషయం చెప్పడమే కాకుండా ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఏడుకొండలును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసును విచారించిన కోర్టు.. న్యాయమూర్తి, నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో పదేళ్ల జైలు, జరిమానాను విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపెట్టే గదులు.. కంపుకొట్టే మరుగుదొడ్లు.. ఇదే పరప్పణ అగ్రహార జైలు