Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తెపై అత్యాచారం చేశాడు.. గర్భం రాకుండా మాత్రలు ఇచ్చిన తండ్రి

ఓ కామపిశాచి... తండ్రి అనే మాట మరిచిపోయి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. అదీ కూడా భార్య ఇంట్లో ఉండగా. భార్య ఉన్న గదికి గడియబెట్టి.. కుమార్తెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివర

కుమార్తెపై అత్యాచారం చేశాడు.. గర్భం రాకుండా మాత్రలు ఇచ్చిన తండ్రి
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (08:28 IST)
ఓ కామపిశాచి... తండ్రి అనే మాట మరిచిపోయి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. అదీ కూడా భార్య ఇంట్లో ఉండగా. భార్య ఉన్న గదికి గడియబెట్టి.. కుమార్తెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ తాడ్‌బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి 13 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి 12 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులు ఇచ్చినా భార్య వద్దకు అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు.
 
ఈ క్రమంలో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం భార్య వద్దకు వెళ్లిన కామపిశాచి.. ఆమె ఉన్న గదికి బయట గడియపెట్టి మరో గదిలో పడుకునివున్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు కూడా బలవంతంగా మింగించాడు. తనకు జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా పోలీసులు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ కిక్... సార్క్ సదస్సు రద్దు.. బోరుమన్న పాకిస్థాన్