Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘ఛలో ఢిల్లీ’కి సిద్ధమవుతున్న తుళ్ళూరు రైతులు

‘ఛలో ఢిల్లీ’కి సిద్ధమవుతున్న తుళ్ళూరు రైతులు
, గురువారం, 18 డిశెంబరు 2014 (13:10 IST)
తుళ్ళూరు రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలసి మద్దతు కోరాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం పూలింగ్ విధానంలో తమ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందనీ,దీని ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని వారికి మొరపెట్టుకోనున్నారు. 
 
వీరంత కలసి డిసెంబర్ చివరి వారంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా దేశ రాజధానికి చేరనున్నారు. తాడేపల్లె, తూళ్ళూరు, మంగళగిరి మండలాలకు చెందిన 29 మంది రైతులు పంటలు పండే భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాలన్ని కృష్ణ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయని అందువలన తమకు పాడిపంటలు పుష్కలంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. ఇవిపోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని చెబుతున్నారు.
 
అయితే కేవలం వర్షాధారిత భూములను మాత్రం తీసుకుని మిగిలిన భూములను వదిలేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్రిష్ణా డెల్టా పరిరక్షణ సమితి వారికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉన్న అన్నహజారే, మేథాపాట్కర్ వంటి సామాజిక కార్యకర్తలను కలిపేందుకు సహకరిస్తామని వారితో తూళ్ళూరు రైతులను సమావేశ పరుస్తామని చెప్పారు. అవకాశం ఉంటే ప్రధాన నరేంద్ర మోడీని కూడా కలసి వినతి పత్రం సమర్పించనున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu