Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు ప్రాణ హాని ఉంది.. శక్తిపూజ చేస్తే బతుకుతావ్.. లేదంటే వారంలో చచ్చిపోతావ్.. నకిలీ స్వామీజీ లీలలెన్నో?

ప్రజల మూఢ నమ్మకాలను కొందరు బాగానే క్యా(ష్)చ్ చేసుకుంటున్నారు. ఇలాంటివారిలో ఈ నకిలీ స్వామీజీ ఒకరు. గంగమ్మ వేషధారణలో చెట్టుకింద ఆశీనులైన ఈ స్వామీజీ.. ఓ మహిళతో 'నీకు ప్రాణ హాని ఉంది. శక్తిపూజ చేస్తే బతుక

నీకు ప్రాణ హాని ఉంది.. శక్తిపూజ చేస్తే బతుకుతావ్.. లేదంటే వారంలో చచ్చిపోతావ్.. నకిలీ స్వామీజీ లీలలెన్నో?
, సోమవారం, 27 జూన్ 2016 (09:18 IST)
ప్రజల మూఢ నమ్మకాలను కొందరు బాగానే క్యా(ష్)చ్ చేసుకుంటున్నారు. ఇలాంటివారిలో ఈ నకిలీ స్వామీజీ ఒకరు. గంగమ్మ వేషధారణలో చెట్టుకింద ఆశీనులైన ఈ స్వామీజీ.. ఓ మహిళతో 'నీకు ప్రాణ హాని ఉంది. శక్తిపూజ చేస్తే బతుకుతావు. లేకపోతే వారం రోజుల్లో చస్తావు. అడిగినంత డబ్బిస్తే.. వెంటనే శక్తిపూజతో నీ ప్రాణాలు నిలబెడతా..' అంటూ చెప్పాడు. ఇది నమ్మిన ఆ భక్తురాలు.. ఇల్లు, సొమ్ములు తాకట్టుపెట్టి డబ్బులు చెల్లించారు. తీరా నకిలీ స్వామీజీ అసలు విషయం గ్రహించి.. గ్రామస్థులే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన గుండు లచ్చయ్య గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తూ వచ్చాడు. చాలీచాలనీ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఒకేసారి డబ్బు సంపాదించాలని భావించాడు. దీంతో పట్టు చీర, రవికె ధరించి గంగమ్మ దేవత అవతారం ఎత్తాడు. గ్రామ శివారులోని గంగమ్మ దేవాలయంలో కూర్చుని పూజలు చేయసాగాడు. ప్రతి అమావాస్య ఆదివారాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మంది భక్తులు ఇక్కడికొస్తూ తమకు తోచినమేరకు కానుకలు సమర్పించుకుంటూ వచ్చారు. 
 
అయితే, ఒకేసారి ధనవంతుడు కావాలన్న అత్యాశతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయసాగారు. ఈ క్రమంలో టేక్మాల్‌ మండలం దాదాయపల్లికి చెందిన కుర్మ మంజుల అనే మహిళ ఆరోగ్యం బాగాలేక స్వామీజిని ఆశ్రయించింది. దీంతో ఆమెకు ప్రాణహాని ఉందని, అడిగినన్ని కానుకలిస్తే ప్రాణాలను శక్తిపూజ చేసి బతికిస్తానని నమ్మించాడు. ఆందోళనకు గురైన ఆమె.. పొలం, ఇల్లు తాకట్టు పెట్టి బంగారం, నగదు, రెండు గొర్రెలను అప్పగించింది. చివరకు మోసపోయినట్లు గ్రహించి.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు స్వామిజీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంచం కోసం వీధి రౌడీల్లా తన్నుకున్న పోలీసులు.. ఎక్కడ?