Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తకు ప్రియురాలితో వివాహం జరిపించిన భార్య.. ఎక్కడ?

భర్తకు ప్రియురాలితో వివాహం జరిపించిన భార్య.. ఎక్కడ?
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (11:11 IST)
కట్టుకున్న భర్తకి భార్య మరో యువతితో వివాహం జరిపించింది. ఇది రీల్ కాదండోయ్.. రియల్. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న జంటను విడదీసి అబ్బాయికి కుటుంబ సభ్యులు ఇంకో పెళ్లి చేశారు. భార్య నిజం తెలుసుకొని భర్తకు ప్రియురాలితో పెళ్లి జరిపించింది. ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావు అదే గ్రామానికి చెందిన భాను ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత సంవత్సరం తప్పనిసరి పరిస్థితులలో ఓ యువతిని అప్పారావు పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి  జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు. స్థానిక శ్రీకోదండరాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్‌వీ-సీ33