Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాలర్ శేషాద్రికి గుండెపోటు... స్విమ్స్ లోనే....

డాలర్ శేషాద్రికి గుండెపోటు... స్విమ్స్ లోనే....
, బుధవారం, 1 అక్టోబరు 2014 (17:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక అధికారిగా సేవలు అందిస్తోన్న డాలర్ శేషాద్రి బుధవారం మధ్యాన్నం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే ఆయనను తిరుమలలోని అశ్విని హాస్పిటల్‌కు తరలించారు. ఐతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను అశ్విని ఆసుపత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
 
డాలర్ శేషాద్రి రెండు దశాబ్దాలకు పైగా తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. కాగా హఠాత్తుగా డాలర్ శేషాద్రికి గుండెపోటు రావడంతో మొదట అశ్వనీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu