నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు తీరాన్ని అనుకునివున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అందువల్ల లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.