Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజాతో తలపడే శక్తి.. సామర్థ్యాలు నాకు లేవు : ధూళిపాళ్ళ నరేంద్ర!

రోజాతో తలపడే శక్తి.. సామర్థ్యాలు నాకు లేవు : ధూళిపాళ్ళ నరేంద్ర!
, సోమవారం, 22 డిశెంబరు 2014 (19:59 IST)
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాతో తలపడే శక్తి, సామర్థ్యాలు తనకు లేవని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. ఆమెతో తాను మాట్లాడలేనని చెప్పారు. పైగా ఆమెను నేను ఏం చేయలేనని, చేసే శక్తి కూడా లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ సీఆర్‌డీఏపై చర్చ సందర్భంగా ధూళిపాళ్ళ మాట్లాడుతూ... ప్రతిపక్షాలకు కొన్ని కనపడుతున్నాయి...ఇంకొన్ని కనపడడం లేదన్నారు. ఇది చారిత్రాత్మక బిల్లు అని అన్నారు. రాజధాని కోసం భూ సమీకరణకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం మనం ఆశల సౌధాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
గతంలో ఐటీని బాబు ప్రోత్సహించినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా? అని చాలా మంది ప్రశ్నించారని, ఇవాళ రైతు బిడ్డలే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సీఆర్డీఏ బిల్లులో అభివృద్ధి ప్రణాళికలను సమగ్రంగా వివరించారని ఆయన స్పష్టం చేశారు. సీఆర్డీఏ అంటే ఏపీ రాజధాని కోసం సీఎం ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ అని, భూసేకరణ, పట్టణ ప్రణాళిక గురించి బిల్లులో అన్ని వివరాలు పూర్తిగా పేర్కొన్నారని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu