Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ‌ధాని లంక‌ల్లోకి స‌ర్వేకి వెళితే... కుక్క‌ల‌తో క‌రిపించేస్తామ‌న్న గ్రామ‌స్తులు

గుంటూరు: అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి అడుగ‌డుగునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. న‌వ్యాంధ్ర రాజ‌ధానికి న‌డిబొడ్డున ఉన్న తుళ్ళూరులో సర్వే నిర్వహించేందుకు సీఅర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అధికారుల‌ను పంపించారు. తుళ్లూరు మండల రెవిన్యూ అధికారి అన్నేసుధీర

రాజ‌ధాని లంక‌ల్లోకి స‌ర్వేకి వెళితే... కుక్క‌ల‌తో క‌రిపించేస్తామ‌న్న గ్రామ‌స్తులు
, సోమవారం, 17 అక్టోబరు 2016 (12:44 IST)
గుంటూరు: అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి అడుగ‌డుగునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. న‌వ్యాంధ్ర రాజ‌ధానికి న‌డిబొడ్డున ఉన్న తుళ్ళూరులో సర్వే నిర్వహించేందుకు సీఅర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అధికారుల‌ను పంపించారు. తుళ్లూరు మండల రెవిన్యూ అధికారి అన్నేసుధీర్ బాబు నేతృత్వంలో లంకలలోనికి స‌ర్వే బృందం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సర్వే ప్రాంతానికి చేరుకున్నారు. సర్వే బృందంతో పాటు కబ్జాదారులు అని ఆరోప‌ణలున్న చుక్కపల్లి ప్రసాద్, రమేష్లు సర్వే ప్రాంతంలో ఉండడంతో గ్రామ‌స్తులు రెచ్చిపోయారు. 
 
రైతుల‌కు, అధికారులకు, త‌మ భూమి అంటూ వచ్చిన వారికీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పడవలు కదిలేందుకు వీలులేదని, ఎవ్వరినీ లంక దాట‌నివ్వ‌మ‌ని, నిర్బంధానికి స్థానికులు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల‌ను కుక్క‌ల‌తో క‌రిపించి, పారిపోయేట్లు చేస్తామ‌ని గ్రామస్తులు హెచ్చ‌రించారు. ఆ భూమి త‌మ‌ద‌ని ఆక్ర‌మ‌ణ‌దారులు సంబంధించిన పత్రాల నకలును రెవెన్యూ అధికారులకు చూపించారు. సీఆర్డీఏ రెవెన్యూ సర్వేయర్ రామాంజనేయులు పత్రాలను పరిశీలించి, స‌ర్వే నిర్వహించడానికి ప్ర‌య‌త్నించారు. కానీ, చెప్పిన మాట వినకుంటే కుక్కలను వదులుతామని కుక్కలతో రెడీగా ఉన్న రైతులు, ఆ కుక్కలు అధికారులవైపు పళ్లు బిగించి చూస్తూ ఉండగా వాటిని చూసి జడుసుకున్న అధికారులు బెదిరి వెనుదిరిగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్మృతి ఇరానీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్