Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో శిఖండి పాత్ర పోషిస్తున్నారు: సీపీఐ నారాయణ

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో శిఖండి పాత్ర పోషిస్తున్నారు: సీపీఐ నారాయణ
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (15:35 IST)
ఏపీ రాజకీయ వ్యవహారాల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఉద్యమాలు వచ్చినప్పుడే సీఎం చంద్రబాబును రక్షించేందుకు ఆయన తెరపైకి వస్తున్నారని చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీల్లో చేర్చగలరా? అంటూ ముక్కుసూటిగా ప్రశ్నించారు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కుల రాజకీయాలను, ఉద్యమాలను తీసుకొచ్చింది చంద్రబాబేనని నారాయణ విమర్శించారు.
 
కాగా, గతంలో తాను టీఆర్ఎస్ వంద స్థానాలు సాధిస్తే చెవికోసుకుంటానని చేసిన వ్యాఖ్యలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ ఇటీవల గ్రేటర్ ఎన్నికలపై మాట మార్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతుండడంపై ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu