Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేదాకా.. సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టకూడదు!

రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేదాకా.. సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టకూడదు!
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (13:26 IST)
రోజుకో పార్టీ మారుతున్న రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే సెక్స్ వర్కర్లపై కేసులు పెట్టకూడదని సీపీఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వైఎస్‌ ఆకర్ష్‌ కింద ఆహ్వానించినప్పుడు కేసీఆర్‌ గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని నారాయణ డిమాండు చేశారు. 
 
అమెరికాలో తెలుగు విద్యార్థులను అవమానించడం బాధాకరమని నారాయణ అన్నారు. అమెరికా చేసిన అవమానానికి విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారని నారాయణ అన్నారు. విద్యార్థులు  ఆత్మహత్య చేసుకుంటే దానికి అమెరికా ఎంబసీయే బాధ్యత వహించాలని నారాయణ కోరారు.

విద్యార్థులు అమెరికాకు వెళ్లేందుకు తిరిగి అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించడం అసాధ్యమన్నారు. ఆ హామీ ఇచ్చిన వారి చొక్కాలు విప్పి ఊరేగిస్తే తాము అండగా ఉంటామని నారాయణ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu