Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్టు 10లోపు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే.. లేకుంటే..?: సీపీఐ

ఆగస్టు 10లోపు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే.. లేకుంటే..?: సీపీఐ
, శుక్రవారం, 31 జులై 2015 (14:09 IST)
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని, అందులో ఏపీ కూడా ఉందని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ తేల్చిచెప్పేసిన నేపథ్యంలో రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
 
అదికూడా.. ఆగస్ట్ 10వ తేదీ లోపల ప్రత్యేక హోదా ప్రకటించాలని లేకపోతే 11వ తేదీన బంద్ నిర్వహిస్తామని కె. రామకృష్ణ వెల్లడించారు. అంతేకాకుండా, ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu