Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 ఎన్నికల్లో మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ఓటేయండి: అలీ పిలుపు

రానున్న 2019 ఎన్నికల్లో ఏ పార్టీలు ముస్లిం మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీకే ముస్లింలు ఓట్లు వేయాలని ప్రముఖ సినీనటుడు అలీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పా

2019 ఎన్నికల్లో మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ఓటేయండి: అలీ పిలుపు
, సోమవారం, 28 నవంబరు 2016 (09:30 IST)
రానున్న 2019 ఎన్నికల్లో ఏ పార్టీలు ముస్లిం మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీకే ముస్లింలు ఓట్లు వేయాలని ప్రముఖ సినీనటుడు అలీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు హామీలు నెరవేర్చకపోగా చివరకు ముస్లింలకే టోపీలు పెడుతున్నాయని అలీ విమర్శించారు.
 
గుంటూరులోని కేకేఆర్‌ ఫంక్షన్ ప్లాజాలో ‘జాగో ముస్లిం... చలో గుంటూరు’ పేరుతో తలపెట్టిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింల ఆత్మీయ సమావేశానికి హాజరైన సినీనటుడు అలీకి సంఘ నాయకులు, నరసరావుపేట టూ వీలర్స్‌ అసోసియేషన్, ఫ్యాన్స్ నాయకులు గజమాల, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. 
 
అనంతరం అలీ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు రంజాన్ పర్వదినానే ముస్లిం మైనార్టీలు కనిపిస్తారని విమర్శించారు. రాజకీయ నేతలు టోపీలు పెట్టుకుంటూ ముస్లింలకు కూడా టోపీలు పెడుతున్నారన్నారు. ముస్లింలంతా సమిష్టిగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బలవంతపు మత మార్పిడులు మంచిది కాదన్నారు.
 
టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైదరాబాద్‌లోని మక్కామసీదు తరహాలో షాహీమసీదు, షాదీఖానా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ముస్లింలకు సెక్యూరిటీ లేకుండా వడ్డీలేని రుణాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు భర్తలతో యువతి కాపురం.. ప్రేమ పెళ్లి పేరుతో మోసం..