Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబు

నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబు
, శుక్రవారం, 21 నవంబరు 2014 (17:41 IST)
దేశంలోని నదులను అనుసంధానం చేయడం వల్ల నీటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నదులను అనుసంధానం చేయాలని కేంద్ర జలవనరులశాఖామంత్రి ఉమాభారతికి ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఒక రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ‘జల మంథన్’ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోందని గుర్తు చేశారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం ఎంతో అవసరమన్నారు. 
 
కొన్ని దేశాలు సముద్రపు నీటిని మంచినీరుగా మార్చుకుంటున్నాయని చెప్పారు. జలవనరులు చాలా ముఖ్యమైనవని, వాటిని కాపాడుకుంటూనే మైక్రో ఇరిగేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి నొక్కివక్కాణించారు. 
 
ఈ దఫా ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం మాత్రమే నమోదైందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నతాధికారుల, నీటి పారుదల రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు జలవనరుల మంత్రి ఉమాభారతి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభును కూడా కలిశారు. 

Share this Story:

Follow Webdunia telugu