Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాళ్లు క్లాస్‌మేట్స్ కాదు...! కామాంధులు.. గుర్గావ్‌లో విద్యార్థినీ రేప్

వాళ్లు క్లాస్‌మేట్స్ కాదు...! కామాంధులు.. గుర్గావ్‌లో విద్యార్థినీ రేప్
, సోమవారం, 31 ఆగస్టు 2015 (11:51 IST)
క్లాస్‌మేట్...! జీవితంలో కలిసి చదవుకునే వాడు. వీళ్ళు గుర్తున్నంతగా మరెవ్వరూ గుర్తుండరు. అయితే ప్రస్తుతం క్లాస్‌మేట్ అంటే భయపడే రోజులు వచ్చేశాయి. ఎవరు ఎప్పడు ఏ విధంగా మాట్లాడుతారో, ఏ విధంగా విరుచుపడతారో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ఓ విద్యార్థిని (16)పై సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గుర్గావ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
విద్యార్థిని శుక్రవారం గుర్గావ్ బస్సు స్టాప్ లో బస్సు ఎక్కేందుకు నిల్చున్న సమయంలో అక్కడకు వచ్చిన కొంతమంది తోటి విద్యార్థులు తమ వెంట రావాలని సూచించారు. అయితే ఆ మాటల్లో కల్మషాన్నిఅర్థం చేసుకోలేని ఆ యువతి వారి వెంట వెళ్లింది.
 
అనంతరం ఆ యువతిని మనేసర్‌కు సమీపంలోని ఓ నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై ఐపీఎస్ మరియు లైంగిక నేరాల కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచామని.. అనంతరం ఆ నిందితులను జువెనైల్ హోంకు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu