Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్

రాజకీయాల్లోనూ 100డేస్ కల్చర్ : చిరంజీవి కామెంట్
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (15:02 IST)
రాజకీయాల్లో 100 రోజుల కల్చర్‌పై కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి కామెంట్ చేశారు. సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu