Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గిన్నిస్ బుక్ రికార్డ్‌లో హనుమాన్ చాలీసా పారాయణం..!

గిన్నిస్ బుక్ రికార్డ్‌లో హనుమాన్ చాలీసా పారాయణం..!
, ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (12:38 IST)
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మంది ఒకే సారి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. 
 
ఆ మేరకు గణపతి సచ్చిదానంద స్వామికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతులమీదుగా గిన్నిస్ బుక్ సర్టిఫికేట్‌ను సచ్చిదానంద స్వామి అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu