Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'వ్యవసాయం దండగ' అన్న కంపెనీ బాబుకు కొత్త ఐడియాలు

'వ్యవసాయం దండగ' అన్న కంపెనీ బాబుకు కొత్త ఐడియాలు
, మంగళవారం, 29 జులై 2014 (18:10 IST)
చంద్రబాబు నాయుడుకి కొత్త ఐడియాలు రావడం లేదని, నాలుగైదు గ్లోబల్ కన్సల్టెన్సీలు రంగంలోకి దిగాయట. కెపిఎంజీ ఇప్పటికే ప్రెజెంటేషన్ ఇచ్చేసింది. దీని సలహా తోటే ఇష్టమొచ్చినట్టు కరెంట్ చార్జీలు పెంచేసి గతంలో పవర్ పోగొట్టుకున్నారు. విద్యుత్ బోర్డును ముక్కలు చేయమని చెప్పింది కూడా ఇదే.
 
ప్రభుత్వ ఉద్యోగాలు కుదించాలంటూ గతంలో చంద్రబాబుకి సలహాలిచ్చిన మెకన్సీ కంపెనీ కూడా కొత్త రాజధాని నిర్మాణంపై 12 వారాల ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తానంటూ లేక్ వ్యూ చుట్టూ తిరుగుతోంది. మెకెన్సీ మాటలు వినే వ్యవసాయం దండగ అని చంద్రబాబు అనగలిగారు. ఈ రెండిటితోపాటు సత్యం కుంభకోణంలో అప్రతిష్టపాలైన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, డిలాయిట్ వంటి మరో రెండు కన్సల్టెన్సీలు ఏపీ ప్రభుత్వనికి సలహాలు అందించేందుకు తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది.
 
ప్రభుత్వరంగ కంపెనీల అమ్మకానికి రంగం సిద్ధం
 
విభజనకారణంగా బడ్జెట్ లోటు పెద్ద సమస్యగా మారింది. దీన్ని పూడ్చుకోవడంతోపాటు ఆర్థికసమస్యల పరిష్కారానికి సిఎం ఐడియాలు అడుగుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలలో కొన్నిటిని అమ్మేందుకు చాపకింద నీరులా కసరత్తు జరుగుతోంది. ఆర్థికమంత్రి యనమల ప్రభుత్వరంగ కంపెనీల స్థితిగతులపై సమీక్షలు కోరడం వెనుక చాలా అనుమానాలొస్తున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu