Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రధానికి ఆహ్వానం : చంద్రబాబు

అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రధానికి ఆహ్వానం : చంద్రబాబు
, మంగళవారం, 7 జులై 2015 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని జపాన్ ప్రధాన మంత్రి షింబజోను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా తమర్ని ఆహ్వానిస్తూ లేఖ రాస్తారని బాబు జపాన్ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. దీనికి షింజో అబే సానుకూలంగా స్పందించారు. పలుసార్లు భేటీ కావడం ద్వారా చంద్రబాబు తనకు దగ్గరి వ్యక్తిగా కనిపిస్తున్నారని ఆత్మీయత వ్యక్తం చేశారు. 
 
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేని ఆ దేశ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు తాము సిద్ధమని చంద్రబాబుకు షింజో అబే హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 
 
పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా, భేటీ సందర్భంగా షింజో అబేకు శ్రీవారి లడ్డూ, శేషవస్త్రం, మెమెంటోను చంద్రబాబు బహూకరించారు.

Share this Story:

Follow Webdunia telugu