Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైలుకు పోయి వ‌చ్చిన‌వాడు... నా బ్రాండ్ దెబ్బ‌తీస్తున్నాడు... 2029 అంటూ టార్గెట్ మార్చిన బాబు

నేను ఏపీని నెంబ‌ర్‌వ‌న్ చేయాల‌నుకుంటే, జ‌గ‌న్ ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తీస్తున్నాడ‌ని సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న వ్యక్తం చేశారు. తాను 2029 నాటికి ఆంద్రప్రదేశ్‌ని భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబెడతాన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీగా బతికా, జైలుకు

జైలుకు పోయి వ‌చ్చిన‌వాడు... నా బ్రాండ్ దెబ్బ‌తీస్తున్నాడు... 2029 అంటూ టార్గెట్ మార్చిన బాబు
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:42 IST)
నేను ఏపీని నెంబ‌ర్‌వ‌న్ చేయాల‌నుకుంటే, జ‌గ‌న్ ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తీస్తున్నాడ‌ని సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న వ్యక్తం చేశారు. తాను 2029 నాటికి ఆంద్రప్రదేశ్‌ని భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబెడతాన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీగా బతికా, జైలుకు పోయివచ్చిన వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, బాధ ఉంటుంది.. కానీ ప్రజల కోసం ఇటువంటివి భరించాల్సి వస్తోంద‌ని బాబు అన్నారు.
 
చంద్రబాబు మాట నేతల వరకేనా!!! 
 
టిడిపిలోకి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన టిడిపి అభ్యర్థులు మధ్య సఖ్యత కుదురుస్తునప్పటికి అవి కేవలం ప్రధమ శ్రేణి నేతల వరకే పరిమితం అవుతున్నాయ‌ని టిడిపి నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ జెండాలు మోసిన తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని కేవలం ఇలా పార్టీ ఫిరాయించిన నేతలు వారి అనుయాయులకే అందలం ఇస్తున్నారని అతర్మథనం చెందుతున్నారు. దీనికి నిదర్శనం గొట్టిపాటి రవిపై కరణం బలరాం వ్యాఖ్య‌లు, భూమా వర్గంపై శిల్పా వర్గం ఎదురుదాడి.
 
ఇలా అనేక ఉదాహరణలు ఉన్న వాటిని ఎవరు సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి. వాటన్నిటికి టిడిపి కార్యకర్తలు నుంచి , మరో ప్రక్క నుంచి వైసీపీ నుంచి ఓక్కటే ప్రశ్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళి పోటీ చేయ్యాలనే డిమాండ్ చేస్తున్నారు. దీనికి టిడిపి రాష్ట్ర నాయకత్వమే సమాధానం తెలపాలని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనాల్లేని అమరావతికి మెట్రో ఎందుకు...? దండగ... చంద్రబాబు షాక్...?!!