Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంతసేపూ నేనే పనిచేసి చావాలా? మీరేం కలెక్టర్లా: మంత్రులపై బాబు మండిపాటు

నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధికోసం రాత్రిపగలూ తానొక్కడినే పనిచేస్తున్నానని మీరేం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై మండిపడ్డారు. రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున

ఎంతసేపూ నేనే పనిచేసి చావాలా? మీరేం కలెక్టర్లా: మంత్రులపై బాబు మండిపాటు
హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (03:32 IST)
నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధికోసం రాత్రిపగలూ తానొక్కడినే పనిచేస్తున్నానని మీరేం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై మండిపడ్డారు. రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున్నాను.. మరి మీరు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై మంత్రులు, అధికారులను పరిగెత్తిస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, టీడీపీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొందరు మంత్రులు అధికారుల్లా ఫీలవుతున్నారని, ఒక్కరూ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనలు మొక్కుబడిగా మారాయని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
 
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, తేలిగ్గా తీసుకుంటే కుదరదని చెప్పారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు గట్టిగా పనిచే యాలన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకం అమలును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ‘ఈ పథకాన్ని నువ్వు వదిలేశావ్‌..’ అని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయని కామినేనిని ఉద్దేశించి చెప్పారు. 
 
రెండు సమావేశాల్లోనూ మంత్రులను టార్గెట్‌ చేసి బాబు మాట్లాడటంతో వారు అవాక్కయినట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు శివాలెత్తడంపై మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇలావుండగా సమన్వయ సమావేశంలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను తిప్పికొట్టాలని మంత్రులు, టీడీపీ నేతలకు సూచించారు. ఏ పత్రికలోనైనా వ్యతిరేక వార్త వస్తే వెంటనే స్పందించి ఎదురుదాడి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోతాం: అనంత నేతలకు బాబు క్లాసు