Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు: చంద్రబాబు

నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు: చంద్రబాబు
, సోమవారం, 31 ఆగస్టు 2015 (11:09 IST)
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు వైకాపా అధినేత జగన్‌పై ప్రత్యక్ష దాడికి దిగారు. నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మ బలిదానాలు చేసుకున్న యువకులకు సంతాపాన్ని ప్రకటిస్తూ, చేపట్టిన తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, జగన్ మాట్లాడుతూ, హోదా ఆలస్యమైందని యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, తెలుగుదేశం, బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు స్టేట్‌మెంట్లతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. విభజన జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారని తీవ్రంగా విమర్శించారు. 
 
తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని కాపాడే శక్తి తెదేపాకు తప్ప ఎవరికీ లేదని భావించిన మీదటే ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. హత్యలు చేయడం వైకాపాకు అలవాటని, ప్రజలను కాపాడేది తామేనని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu