Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస వాళ్లు సరిగా కాపురం చేయకపోతే నేను కారణమా?: చంద్రబాబు

తెరాస వాళ్లు సరిగా కాపురం చేయకపోతే నేను కారణమా?: చంద్రబాబు
, బుధవారం, 22 అక్టోబరు 2014 (17:10 IST)
తెలంగాణ సర్కారుపై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. తెలంగాణ విద్యుత్ కొరతకు చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై చంద్రన్న మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ కొరతను సమర్థవంతంగా డీల్ చేయని కేసీఆర్.. తనపై తప్పులు చెబుతారా అని ప్రశ్నించారు.
 
టీఆర్ఎస్ అసమర్థతను తమపై రుద్దడం సరికాదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఏది జరగకపోయినా తానే కారణమంటూ బురదచల్లటం సరికాదని, తెలంగాణ విద్యుత్ కోతకూ, తెరాస వాళ్లు సరిగా కాపురం చేయకపోతే తానే కారణమవుతానా? నేనెలా కారణమవుతానని చంద్రబాబు సెటైర్లు విసిరారు.
 
విశాఖపట్నాన్ని హుదూద్ తుఫాను అల్లకల్లోలం చేస్తే.. విద్యుత్‌తో పాటు నానా కష్టాలతో ప్రజలు బాధపడుతుంటే.. 24 గంటలూ 1400 మందితో పనిచేయించుకుంటున్నానని, పండుగకు కూడా సొంత ఊళ్లకు పంపకుండా సహాయక చర్యలు చేయిస్తుంటే.. అన్నీ వనరులుండి.. ముందుచూపు లేకుండా విద్యుత్ కష్టాలను తెచ్చుకున్న తెలంగాణ సర్కారు.. అందుకు తాను కారణమంటూ పబ్బం గడుపుకుంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణకు విద్యుత్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని.. విద్యుత్ సమస్యల్ని తీర్చుకోకుండా ఇతరులపై భారం మోపి కాలం గడుపుతున్న కేసీఆర్‌ను ఏమనాలని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu