Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటుకు నోటు కేసు చార్జిషీటు.. 33 చోట్ల చంద్రబాబు పేరు ప్రస్తావన

ఓటుకు కోట్లు కేసు మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రేపేలా కనిపిస్తోంది. ఈ కేసు విచారణనను నెల రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ

ఓటుకు నోటు కేసు చార్జిషీటు.. 33 చోట్ల చంద్రబాబు పేరు ప్రస్తావన
, బుధవారం, 31 ఆగస్టు 2016 (10:22 IST)
ఓటుకు కోట్లు కేసు మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రేపేలా కనిపిస్తోంది. ఈ కేసు విచారణనను నెల రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 
 
అదేసమయంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పేరును పలుమార్లు ప్రస్తావించారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. అలాగే ఏ-1 నిందితుడు, నేరుగా డబ్బులు అందజేసిన ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణల్లో కూడా 'బాస్' ఆదేశాల మేరకు తాను వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ కూడా న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీఎం చంద్రబాబు పేరును దాదాపు 33 చోట్ల ప్రస్తావించింది. అలాగే స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డు అయిన వాయిస్ నిజమైనదేనని, ఎక్కడా కట్, పేస్టులు లేవని, ఒకే నిడివిగల సంభాషణ అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కూడా న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. ఈ వాయిస్ విషయంలో ముంబైకి చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ.. ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధారించింది. దీంతో వాయిస్ విషయంలో స్పష్టత రావడంతో సీఎం చంద్రబాబు పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని యోచిస్తోంది.
 
అయితే న్యాయస్థానంలో ప్రైవేటు పిటీషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం సీఎం చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్-12, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరకు ఏ క్లాజు ప్రకారం చేర్చాలనే విషయంలో ఏసీబీ అధికారులు బుధవారం న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిని అడ్డుకున్న వాట్సాప్ సందేశం...