Publish Date: Fri, 06 Mar 2026 (20:42 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (20:46 IST)
శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే, కౌన్సిల్‌లో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. సభ్యులు వెంటనే వైద్యులకు ఫోన్ చేశారు. ప్రస్తుతానికి, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. ఆయన అనారోగ్యానికి కారణం బీపీలో హెచ్చుతగ్గులు అని వైద్యులు గుర్తించారు. బొత్సకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
బొత్స సత్యనారాయణ పూర్తిగా కోలుకునే వరకు హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరారు. డిశ్చార్జ్ అయిన తర్వాత, ఆయన కౌన్సిల్‌కు తిరిగి వచ్చారు.
మరోవైపు బొత్స సత్యనారాయణ ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో బొత్స సత్యనారాయణకు చికిత్స అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బొత్స సత్యనారాయణ.. మళ్ళీ శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. అయితే మాట్లాడుతున్న సమయంలో బీపీ పెరిగి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచనతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.