Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షీణించిన భూమా ఆరోగ్య పరిస్థితి: నిమ్స్‌కు తరలించడంలో పోలీసుల డైలమా

క్షీణించిన భూమా ఆరోగ్య పరిస్థితి: నిమ్స్‌కు తరలించడంలో పోలీసుల డైలమా
, ఆదివారం, 5 జులై 2015 (13:06 IST)
వైకాపా సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం కర్నూలులోని సర్వజన వైద్యశాలకు తరలించిన పోలీసులు అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భూమాకు హై బీపీ, ఛాతీ నొప్పి, షుగర్ లెవల్స్ పడిపోయిన తరుణంలో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ.. టెన్షన్ పడుతున్నారు. జైలులోనే దీక్ష చేపట్టిన భూమాకు ఏమైనా రాజకీయ పరిణామాల్లో మార్పులు తప్పవని పోలీసులు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని నిమ్స్‌కు తరలించాలన్న భూమా విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన పోలీసులు కర్నూలులోనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశారు. తాజాగా ఆదివారం ఉదయం భూమా ఆరోగ్యం మరింత విషమించిన నేపథ్యంలో నిమ్స్‌కు తరలించక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు భూమాను హైదరబాదుకు తరలించే విషయంపై సందిగ్ధంలో కూరుకుపోయి ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu