Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ నిజమైన హీరో : తెలంగాణ మంత్రి రాజయ్య!

బాలకృష్ణ నిజమైన హీరో : తెలంగాణ మంత్రి రాజయ్య!
, సోమవారం, 20 అక్టోబరు 2014 (14:08 IST)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య నందమూరి హీరో, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణను కొనియాడారు. బాలయ్య ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా రోగులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారని రాజయ్య ప్రశంసించారు.  
 
బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రాజయ్య మాట్లాడారు. పేదలకు ఈ ఆసుపత్రి విలువైన సేవలు అందిస్తున్నదన్నారు. బాలకృష్ణ నిజమైన హీరో అన్నారు. తెలుగు ప్రజలు క్యాన్సర్‌తో బాధపడకుండా చేసేందుకు ఈ ఆసుపత్రి అనేక కార్యక్రమాలను చేపట్టిందని కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu