Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం సానుకూలం.. చేతులు ముడుచుకోలేదు!

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం సానుకూలం.. చేతులు ముడుచుకోలేదు!
, శనివారం, 20 ఫిబ్రవరి 2016 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే అంశంపై  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు స్పందించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా ఉందని అశోక్‌గజపతి రాజు శుక్రవారం విజయనగరంలో చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శించినట్లు తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కూడా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.
 
రైల్వే బడ్జెట్‌లో విశాఖ జోన్‌ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో కూడా ‘ప్రత్యేక హోదా’ కల్పించాలని కోరిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో భారీ మెడికల్ హెల్త్ ప్రాజెక్టు వచ్చింది. అమరావతి వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అమృత యూనివర్శిటీ ముందుకొచ్చింది. వర్సిటీకి అనుబంధంగా 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతామని తెలిపింది. దాంతోపాటు రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ క్యాంపస్ నిర్మాణం చేయనుంది. రూ.2,500 కోట్లతో రాజధానిలో ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu