Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడి...

ఐదారు నెలల్లో జరుగనునన్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ఆశించినంత చుర్గుగా సాగడం లేదు. ఎంత ప్రచారం చేస్తున్నా ప్రక్రియ ఊపందుకోవడం లేదు. రాయలసీమ తూర్పు (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) రాయలసీమ

తిరుపతిలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడి...
, మంగళవారం, 1 నవంబరు 2016 (12:36 IST)
ఐదారు నెలల్లో జరుగనునన్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ఆశించినంత చుర్గుగా సాగడం లేదు. ఎంత ప్రచారం చేస్తున్నా ప్రక్రియ ఊపందుకోవడం లేదు. రాయలసీమ తూర్పు (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) రాయలసీమ పశ్చిమం (కడప, నెల్లూరు, ప్రకాశం ) రాయలసీమ పశ్చిమం (కడప, కర్నూలు, అనంతపురం ) నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో జరుగనున్నాయి. ఇటు పట్టుభద్రులు, అటు ఉపాధ్యాయ నియోజవర్గాలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమైనా ఓటర్లు మాత్రం సరిగ్గా చేరడం లేదు.
 
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 2 లక్షల మందికిపైగా పట్టుభద్రులు ఉండగా గత ఎన్నికల్లో 61 వేల మంది మాత్రమే ఓటర్లుగా చేరారు. నెల్లూరు జిల్లాలో 55వేలు, ప్రకాశంలో 62 వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. అంటే అర్హుల్లో మూడో వంతు మంది కూడా ఓటు నమోదు చేసుకోలేదు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. 
 
గతంలో ఓటర్లుగా ఉన్న వారు కూడా మళ్ళీ తాజాగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ధేశించింది. ఇందుకు నవంబర్‌ 5 దాకా గడువు ఇచ్చింది. అయితే చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో కూడా ఓటర్లుగా చేరలేదు. ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుని శాసన మండలికి పంపగల అవకాశం ఉన్నా పట్టభద్రులు పట్టించుకోవడం లేదు.
 
పట్ట భద్రులందరినీ ఓటర్లుగా చేర్చాలంటూ ఎన్నికల సంఘం అధికారుల జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటరుగా చేరేందుకు గడువు పెంచే అవకాశం ఉండబోదని చెబుతున్నారు. అయినా కదలిక లేదు. ఓటరుగా చేరకపోతే రాజ్యాంగం మనకు కల్పించినా ఓటు హక్కును కోల్పోయినట్లే. ఇప్పటికైనా పట్టభద్రులు స్పందించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు నడకదారి - హాకర్లకు అడ్డదారి