Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెయిల్ పై బయటకొచ్చిన రేవంత్ రెడ్డి... స్వీట్లు తిన్న గంటా శ్రీనివాసరావు

బెయిల్ పై బయటకొచ్చిన రేవంత్ రెడ్డి... స్వీట్లు తిన్న గంటా శ్రీనివాసరావు
, మంగళవారం, 30 జూన్ 2015 (12:22 IST)
రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ మంత్రులు పండుగ చేసుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు రేవంత్ బెయిల్ విషయం తెలియగానే స్వీట్లు తెప్పించి ఆయన కూడా తిన్నారు. బ్రదర్ రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందని తాను విశ్వసించాననీ, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆయన చెప్పుకొచ్చారు.
 
మరోవైపు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా సస్పెన్షన్ వేటు వేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోందన్న వార్తల నేపధ్యంలో రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే టి.టిడిపి నాయకులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ లభించినందుకు కుటుంబసభ్యులు ఆనందోత్సాహాలతో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu