Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ పాల‌న ఇక బెజ‌వాడ నుంచే... ఏ కార్యాల‌యం ఎక్క‌డ‌?

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌తో ఏపీ పాల‌న యంత్రాంగం అంతా ఇపుడు బెజ‌వాడ‌కు త‌ర‌లిపోయింది. హైద‌రాబాదులోని సెక్ర‌టేరియేట్ తో పాటు వివిధ శాఖాధిప‌తుల కార్యాల‌యాలు కూడా విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశాయి... విజయ

ఏపీ పాల‌న ఇక బెజ‌వాడ నుంచే... ఏ కార్యాల‌యం ఎక్క‌డ‌?
, సోమవారం, 27 జూన్ 2016 (20:56 IST)
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌తో ఏపీ పాల‌న యంత్రాంగం అంతా ఇపుడు బెజ‌వాడ‌కు త‌ర‌లిపోయింది. హైద‌రాబాదులోని సెక్ర‌టేరియేట్ తో పాటు వివిధ శాఖాధిప‌తుల కార్యాల‌యాలు కూడా విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశాయి... విజయవాడలో నూతన రాష్ట్ర కార్యాలయాలు ఏవి ఎక్క‌డ ఉన్నాయో వివ‌రాలివి.
 
 సూర్యారావుపేటలోని సివిల్‌ కోర్టు కాంపౌండ్‌, పక్కన రాష్ట్ర ఇరిగేషన్‌ కార్యాలయం,

రమేష్‌ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాలయం, 
 
గుణదలలో ఈఎస్‌ఐ ఆస్పత్రి దగ్గర లీగల్‌ మెట్రాలజీ కార్యాలయం, 
 
బస్టాండ్‌ దగ్గర పోలీస్‌ కంట్రోల్‌రూం వెనుక రాష్ట్ర అగ్నిమాపకశాఖ కార్యాలయం, 
 
సూర్యారావుపేటలోని సీఎంవో సమీపంలో డీజీపీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం 
సూర్యారావు పేట సీఎంవో పక్కనే సమాచార శాఖ కార్యాలయం, 
 
పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ పాలనా కార్యాలయం, 
పండిట్‌ నెహ్రూ బస్‌ కాంప్లెక్స్‌లో రవాణాశాఖ కార్యాలయం.
 
సూర్యారావుపేటలోని చరితశ్రీ బిల్డింగ్‌లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం, 
 
బందర్‌ రోడ్డులోని పీడబ్ల్యూడీ కాంపౌండ్‌ ఎదురుగా పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ కార్యాలయం, 
 
గొల్లపూడి సెంటర్‌లోని వసుధ కాంప్లెక్స్‌లో గ్రామీణ మంచినీటి సరఫరా కార్యాలయం, 
 
పాయకాపురంలోని సోషల్ వెల్ఫేర్‌ భవన్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం, 
 
ఏలూరు రోడ్డులోని జీపీఆర్‌ స్ట్రీట్‌లోని వి.ప్లాజాలో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం.
 
ప్రసాదంపాడులోని టయోటా షోరూం ఎదురుగా ఉన్న ఏఎన్‌ఆర్‌ టవర్స్‌లో సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం,
 
బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాప్‌ కార్యాలయం
 
గొల్లపూడిలోని టీటీడీసీ కార్యాలయంలో వెలుగు రాష్ట్ర కార్యాలయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు... పట్టుకున్నారు... నేను కాదంటున్న యువకుడు...