Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదిరిందయ్యా చంద్రం .. చంద్రబాబు యేడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం

అదిరిందయ్యా చంద్రం .. చంద్రబాబు యేడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం
, బుధవారం, 27 మే 2015 (15:32 IST)
'అదిరిందయ్యా చంద్రం' పేరుతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఆడియో సీడీని విడుదల చేసింది. ఇందులో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యేడాది పాలనపై విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ అందులో పేర్కొంది. 
 
ఈ సీడీని ఏపీ కాంగ్రెస్ నేతలు కేవీపీ, రఘువీరా రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డిలు కలిసి బుధవారం విడుదల చేశారు. 'అదిరిందయ్యా చంద్రం' పేరుతో ఈ సీడీ విడుదలైంది. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఏర్పాటు చేశాక వైఫల్యాలను అందులో వివరించినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం ఒక్క వాగ్దానాన్నీ అమలుపర్చలేదన్నారు. టీడీపీ మహానాడు కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని ఆయన ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu