Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్క్ హయత్‌కు ఏపీ సీఎం ఫ్యామిలీ... ఎందుకు బావా... మా ఇంటికి రండి... బాలయ్య ఆహ్వానం

హైద‌రాబాదులోని మ‌దీనాగూడ‌ వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి... జూబ్లి హిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌కి సీఎం చంద్ర‌బాబు త‌న నివాసం మార్చారు. ఇంత‌కాలం సీఎం ఫ్యామిలీ హైద‌రాబాదు శివారులోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఉండేది. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద చంద్ర‌బాబు

పార్క్ హయత్‌కు ఏపీ సీఎం ఫ్యామిలీ... ఎందుకు బావా... మా ఇంటికి రండి... బాలయ్య ఆహ్వానం
, సోమవారం, 23 మే 2016 (22:12 IST)
హైద‌రాబాదులోని మ‌దీనాగూడ‌ వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి... జూబ్లి హిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌కి సీఎం చంద్ర‌బాబు త‌న నివాసం మార్చారు. ఇంత‌కాలం సీఎం ఫ్యామిలీ హైద‌రాబాదు శివారులోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఉండేది. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద చంద్ర‌బాబు పాత ఇంటిని కూల్చి, కొత్త ఇల్లు క‌ట్టుకుంటున్నారు. ఈలోగా ఇంటిని మ‌దీనాగూడ‌కు మార్చారు. అయితే, ఇపుడు చంద్ర‌బాబు మ‌న‌వ‌డు దేవాన్ష్‌ను చూసుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని, అత‌ని కోసం ఫ్యామిలీ అంతా మ‌కాం మార్చారు. 
 
చంద్ర‌బాబు సీఎంగా అధిక‌శాతం విజ‌య‌వాడ‌లోనే నివాసం ఉంటున్నారు. కానీ, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, త‌న‌యుడు లోకేష్, కోడ‌లు బ్ర‌హ్మ‌ణి, మ‌న‌వ‌డు దేవాన్ష్ హైద‌రాబాదులో ఉంటున్నారు. అయితే, మ‌దీనాగూడా నుంచి నిత్యం లోకేష్ టీడీపీ కార్యాల‌యానికి, భువ‌నేశ్వ‌రి, బ్రహ్మ‌ణి హెరిటేజ్ కంపెనీకి రావ‌డానికి 16 నుంచి 20 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తోంది. పైగా దేవాన్ష్‌ని మ‌ధ్యమ‌ధ్య‌లో చూసుకోవ‌డానికి ఒక‌టికి రెండుసార్లు ఇంటికి వెళ్లాలంటే, ట్రాఫిక్‌తో స‌మ‌యం గ‌డిచిపోతోంది. దీనిని నివారించేందుకు ఫ్యామిలీని జూబ్లిహిల్స్‌లోని పార్క్ హ‌య‌త్‌కి మార్చారు.
 
సెక్యూరిటీ ప‌రంగా, సౌక‌ర్యానికి ఇదే క‌రెక్ట్ అని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో పైన వివిఐపిల‌కు ప్రత్యేక ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో సొంతంగా వంట చేసుకోవ‌డానికి అన్ని సౌక‌ర్యాలున్నాయి. కొందరు ఫిలిం స్టార్లు కూడా ఇక్క‌డే ఉంటున్నారు. అయితే, విజ‌య‌వాడ నుంచి చంద్ర‌బాబు హైద‌రాబాదుకు వచ్చిన‌పుడు మాత్రం ప్యామిలీ అంతా మ‌ళ్లీ ఫాంహౌస్‌కు చేరిపోతుంద‌ట‌. ఇంత ఇబ్బంది ఎందుకు మా ఇంటికి రండ‌ని బాల‌కృష్ణ చంద్ర‌బాబు ఫ్యామిలీని ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. కానీ, చంద్ర‌బాబు దానిని సున్నితంగా తిరస్క‌రించిన‌ట్లు స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఉద్యాన‌వ‌న మ‌హోత్స‌వం... మామిడి ప్ర‌ద‌ర్శ‌న‌