Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సింహా'ను బెంబేలెత్తించిన పీఏ... బాబు బావ ఆగ్రహం, బాలకృష్ణకు ఆ పని తప్పలేదు...

అంతేమరి. నమ్మకంతో తన వ్యక్తిగత సహాయకుడితో నియోజకవర్గ పనులు చేయవయ్యా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్ ను పురమాయించారట. తను సినిమాలతో బిజీగా వున్నప్పుడు కాస్త పనులను చక్కబెట్టమని తాళం చెవి చేతికిస్తే పీఏ కాస్తా పీకుడు మనిషిగా మారిపోయారు.

'సింహా'ను బెంబేలెత్తించిన పీఏ... బాబు బావ ఆగ్రహం, బాలకృష్ణకు ఆ పని తప్పలేదు...
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:41 IST)
అంతేమరి. నమ్మకంతో తన వ్యక్తిగత సహాయకుడితో నియోజకవర్గ పనులు చేయవయ్యా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్ ను పురమాయించారట. తను సినిమాలతో బిజీగా వున్నప్పుడు కాస్త పనులను చక్కబెట్టమని తాళం చెవి చేతికిస్తే పీఏ కాస్తా పీకుడు మనిషిగా మారిపోయారు. 
 
పని కావాలంటే పచ్చనోట్లు పెట్టాల్సిందేనని ఆయన ఫిక్స్ కావడంతో హిందూపురంలో తేదేపా శ్రేణులు నివ్వెరపోవడమే కాదు, ఆయన వైఖరికి తమ పదవులకు రాజీనామాలు చేసి నానా గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారం అంతా పత్రికల పతాక శీర్షికల్లో వచ్చేశాయి. ఇక ప్రతిపక్షం వూరుకుంటుందా... ఏకిపారేసింది. 
 
విషయం మరీ రచ్చరచ్చ అవడంతో విషయాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. పీఏ వ్యవహారం ఏంటంటూ బాలకృష్ణకు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయడంతో సింహా బెంబేలెత్తిపోయారట. వెంటనే బావ అసహనాన్ని గమనించిన బాలయ్య పీఏ శేఖర్ ను ఆ పదవి నుంచి తప్పించక తప్పలేదు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టకేలకు ఢిల్లీలో భూకంపం వచ్చింది.. రాహుల్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు