Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని రైతులకు ఊరట.. భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు : హైకోర్టు

రాజధాని రైతులకు ఊరట.. భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు : హైకోర్టు
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:46 IST)
రాజధాని నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో పంట భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్న రైతులకు ఉమ్మడి హైకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చని, వ్యవసాయం మినహా ఇతర పంటలు వేయరాదని స్పష్టం చేసింది. 
 
అలాగే, అయితే ఇతర వ్యక్తులకు భూములు విక్రయించవద్దని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. రైతులు తమ భూముల్లో నిరాటంకంగా పనులు చేసుకోవచ్చని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
భూ సమీకరణను సవాల్ చేస్తూ ఏపీ రాజధాని ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులు, నేషనల్ అలియెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్‌లు కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పిటిషన్ దాఖలు చేసిన రైతులు తమ భూములు అమ్మకూడదని, అంతేగాక కౌలుకు కూడా ఇవ్వకూడదని రైతులను కోర్టు ఆదేశించింది. వ్యవసాయం మినహా ఇతర అవసరాలకు దానిని వినియోగించరాదని తేల్చిచెప్పింది. 
 
ఈ క్రమంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో సంస్థ ప్రమేయాన్ని ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. భూముల సమీకరణలో భూములు ఇవ్వని వారిపై ప్రభుత్వం తరపున ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చట్ట ప్రకారం భూ సమీకరణకు వెళ్తామని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణకు కోర్టు జులై మొదటి వారానికి వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu