Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజాను బుచ్చయ్య తిట్టారా.. రికార్డులు పరిశీలిద్దాం : స్పీకర్ కోడెల

రోజాను బుచ్చయ్య తిట్టారా.. రికార్డులు పరిశీలిద్దాం : స్పీకర్ కోడెల
, సోమవారం, 22 డిశెంబరు 2014 (17:21 IST)
వైకాపా ఎమ్మెల్యే రోజాను టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగతంగా తిట్టారా లేదా అనే విషయాన్ని అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే తేలిపోతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల్ శివప్రసాదరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా సోమవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో స్పీకర్‌పై విధంగా స్పందించారు. 
 
అసెంబ్లీలో తనను తిట్టడమే కాకుండా మాట్లాడకుండా చేశారని రోజా స్పీకర్‌కు వద్దకు తీసుకువెళ్లారు. దీంతో స్పీకర్ మాట్లాడతూ.. అసెంబ్లీ రికార్డులు ఆధారంగా తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని తెలిపారు. సభాధిపతిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోడెల తెలిపారు.
 
సభలో జరిగిన విషయం రికార్డుల్లో భద్రంగా ఉంటుందని, ఐదుగురు సభ్యుల కమిటీ వేస్తానని, ఆ రికార్డులు పరిశీలించిన కమిటీ ఏది సూచిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ్యుల మాటలు సభను కించపరిచేలా ఉన్నాయని, అలా ఉండకూడదని అన్నారు.
 
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు.  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వాయిదా వాయిదా పడింది. 

Share this Story:

Follow Webdunia telugu