ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంటే ఎంతో జాగ్రత్తగా నడుపుతుంటారని చెప్పుకునే మాటను ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు చెరిపేస్తున్నాయి. మొన్న కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే ఇంకో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. Morning star ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది.
ఐతే అక్కడ కాస్త ఇసుకు మెత్తగా వుండటంతో బస్సు కూరుకుపోయింది. దీనితో బస్సులో వున్న ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నారు. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీలు చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూస్తున్నారు.