Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

Advertiesment
Digital media
ఏపీలో ఇక 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ నిషేధించారు. ఈ మేరకుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధిస్తుందని సీఎం చెప్పారు. సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం నుండి పిల్లలను రక్షించే లక్ష్యంతో 90 రోజుల్లోపు ఈ నిషేధాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 
 
16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా ఈ పరిమితిని విస్తరించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, సంప్రదింపుల తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోవాటర్ 2024-25 రిపోర్ట్: సివిల్ ఇంజినీరింగ్‌లో అద్భుతమైన కెరీర్ అభివృద్ధి