Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల 'పద్మ' ప్రతిపాదనలు ఇవే...

ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల 'పద్మ' ప్రతిపాదనలు ఇవే...
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యేడాదికి ‘పద్మ’ అవార్డుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపంచినట్టు సమాచారం. ఇటీవల మృతి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు పేరును 'పద్మ విభూషణ్' పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయనుంది. బాపుతో పాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ రాజ్ రెడ్డి పేర్లను 'పద్మవిభూషణ్'కు సిఫార్సు చేస్తోంది. 
 
అలాలగే, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూరి, సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ పేర్లను 'పద్మభూషణ్' కోసం సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది. ఇక 'పద్మశ్రీ' పురస్కారం కోసం పంపించిన జాబితాలో సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. 
 
అదేవిధంగా 'భారతరత్న'ను మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. 'పద్మవిభూషణ్'కు ఆచార్య జయశంకర్, 'పద్మభూషణ్'కు ఆచార్య జి.రామిరెడ్డి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. పద్మశ్రీ అవార్డుకు కూడా కొంతమంది పేర్లను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల్లో ఈ జాబితాపై సీఎం ఆమోదముద్ర వేశాక కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu