Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం.. సరికొత్త భూసేకరణ విధానం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం.. సరికొత్త భూసేకరణ విధానం!
, గురువారం, 30 అక్టోబరు 2014 (19:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు రైతుల నుంచి భూసమీకరణకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్ళూరు మండలాలలోని 17 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నారు. 
 
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత భూసేకరణపై ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ రైతుల నుంచి భూమిని సమీకరించి ప్రజారాజధాని నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం వున్న వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 
 
అలాగే, రాజధాని నిర్మాణం కోసం గ్రామాలు, వాటిలోని ఇళ్ళ జోలికి వెళ్ళబోమని స్పష్టం చేశారు. భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న కొద్దిమంది రైతులను ఒప్పించడానికి అథారిటీ కృషి చేసి, వారిని ఒప్పిస్తామని తెలిపారు. 
 
ప్రభుత్వ భూమి ఉన్న పట్టాదారులకు ప్రత్యేక విధానం అమలు. 30 వేల ఎకరాలను ఆరు సెక్టార్లుగా అభివృద్ధి చేయనున్నారు. లాటరీ విధానం ద్వారా రైతులకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో భూమిని కేటాయిస్తామన్నారు. రైతులకు పదేళ్ళపాటు ఎకరానికి 25 వేల రూపాయల అదనపు సాయం అందజేస్తామని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu