Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ బడ్జెట్ 2014-15 : యనమల ప్రసంగం విశేషాలు... కొన్ని...

ఏపీ బడ్జెట్ 2014-15 : యనమల ప్రసంగం విశేషాలు... కొన్ని...
, బుధవారం, 20 ఆగస్టు 2014 (14:02 IST)
రూ.లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ 2014 - 15ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
 
రూ. 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. 
రూ.85 వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. 
రూ.26 వేల కోట్ల ప్రణాళికా వ్యయం. 
రూ. రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. 
ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు. 
 
అంతేకాకుండా, జేఎన్ఎన్ఆర్ఎం కింద స్మార్ట్ సిటీల అభివృద్ధి, చిత్తూరు, కాకినాడలలో ట్రిపుల్ ఐటీలు, కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు ఏర్పాటు, కాకినాడలో ఎల్ఎన్జీ టర్మినల్, విశాఖ గంగంవరం పోర్టు దగ్గర మరో ఎల్ఎన్జీ టర్మినల్, విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల విస్తరణ, వైజాగ్- చెన్నై కారిడార్‌ అభివృద్ధికి ప్రాధాన్యం, కొత్తగా 6 ఏపీఎస్పీ బెటాలియన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు, పేద విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు 13 బీసీ స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అంశాలు ప్రధానంగా పేర్కొన్నారు.
 
అలాగే, విజన్ 2020కి కొత్త హంగులు.. విజన్ 2029 ఫార్ములాతో ముందడుగు, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్, లక్షన్నర వరకు రైతు రుణాల మాఫీ, ఆధార్ కార్డుతో లింకు, విశాఖలో విమ్స్, తిరుపతిలో స్విమ్స్ కేంద్ర నిధులతో అభివృద్ధి, విజయవాడ- కాకినాడల మధ్య గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్. 

Share this Story:

Follow Webdunia telugu