Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

100 రోజుల బాబు సినిమా ప్లాప్ : అంబటి ధ్వజం

100 రోజుల బాబు సినిమా ప్లాప్ : అంబటి ధ్వజం
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు వంద రోజుల పాలనను ప్లాప్ అయిన సినిమాగా అభివర్ణించారు. 
 
బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమని అంబటి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
 
విజయవాడ రాజధానిగా అందరికీ సమ్మతమేనని అయితే, చర్చ లేకుండా ప్రకటన చేయడమే సరికాదన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. వంద రోజులైనా రుణమాఫీపై సంతకం పెట్టలేదన్నారు. 
 
ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్దానాలు చేశారని, పాదయాత్రలో మరో మూడు వందల వాగ్దానాలు చేశారని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా చెప్పాలని అంబడి అడిగారు.

Share this Story:

Follow Webdunia telugu