Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కడి లారీలు అక్కడే... రోడ్లని ఖాళీ... ఆగిన 16లక్షల లారీలు

ఎక్కడి లారీలు అక్కడే... రోడ్లని ఖాళీ... ఆగిన 16లక్షల లారీలు
, గురువారం, 1 అక్టోబరు 2015 (10:06 IST)
ఏ మార్గంలో వెళ్లినా టోల్ ఫీజుతో తోలు తీస్తున్నారు... ఏ మార్గాన వెళ్ళినా పర్మిట్లతో బాదేస్తున్నారు. ఏం చేయాలి. ఎలా గిట్టుకుంటుంది. తమకు సాధ్యం కాదంటూ దేశ వ్యాప్తంగా సరుకు రవాణా లారీల యజమానులు సమ్మెకు దిగారు. వీటన్నింటిని వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 
 
దేశంలోని అన్ని మార్గాలలో టోల్‌ ప్లాజాల అరాచకాలపై లారీల యజమానులు గళం విప్పారు. వారు వసూలు చేసే ఫీజులు తమకు పెనుభారంగా మారతున్నాయని ఆవేదన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో చేపట్టిన సమ్మెకు తెలుగు రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని దాదాపు 16లక్షలలకు పైగా సరకు రవాణా చేసే లారీలు నిలిచిపోయాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ పరిదిలోనే 10 లక్షల లారీలు నిలిపోయి ఉంటాయి. 
 
దీతో వాహనాలు కనిపించక జాతీయ రహదారులన్నీ బోసిబోయి కనిపిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఓవర్‌లోడ్‌ పేరిట చెక్‌పోస్టు వద్ద అక్రమవసూళ్లు నిరసిస్తూ సమ్మె చేపట్టినట్లు లారీ యజమానుల సంఘాలు తెలిపాయి. ఇప్పటి వరకూ ఇబ్బంది లేదు కానీ రానున్న రెండు మూడు రోజులలో సరుకుల రవాణాలో తీవ్ర సంక్షోభం నెలకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu